ఏల్క గూడెం శ్రీకాంత్ కు ఆర్థిక సాయం చేసిన లోకల్ గైడ్ ఎండీ, సి.హెచ్ రాంరెడ్డి
షాద్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ శ్రీకాంత్ కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు
ప్రజా గొంతుక న్యూస్ : రంగా రెడ్డి జిల్లా బ్యూరో ఆర్ఆర్ గౌడ్
చౌదరి గూడెం మండలం ఎల్క గూడెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనారోగ్యంతో షాద్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. పేదరికంతో ఎదుర్కొంటున్న సమాయం లో లోకల్ గైడ్ సిఎండీ రాంరెడ్డి మెరుగైన వైద్యం కోసం తన వంతు సహాయంగా చేయుతనందించాడు. షాద్ నగర్ తన సొంత ఊరైన ఎలుకగూడెం గ్రామం వాసులు ఎవ్వరికైనా అపద వేస్తే చిరు సాయం అందిస్తూ తన వంతు కర్తవ్యం గా పుట్టిన ఊరు ప్రజలందరూ తన కుటుంబ సభ్యులుగా భావించి గ్రామానికి సామాజిక సేవలు అందిస్తున్నారు. వృత్తిపరంగా ఆయన హైదరాబాదులో సెటిల్ అయినప్పటికీ తన ఊరు మీద ప్రేమాభిమానాలతో అనేక మందికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అదే తరుణంలో చాకలి శ్రీకాంత్ అనే యువకుడు హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని కుటుంబానికి ధీమా వ్యక్తం చేశారు.