భీమపాక పెదరాజుకు మహాకవి గుర్రం జాషువా పురస్కారం
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
భద్రాచలం పట్టణంలోని గత పది సంవత్సరాల నుండి నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులను, దివ్యాంగులను, చేరదీసి వారికి ఆసరాగా నిలిచింది అందులో భాగంగానే ఈ మా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం చే ఉత్తమ సేవా సంస్థగా, గౌరవాన్ని దక్కించుకున్న విషయం పట్టణ ప్రజలకు తెలిసిందే,
అంతేకాకుండా తెలంగాణ రత్న అవార్డు, రోటరీ క్లబ్ భద్రాచలం వారిచే ఒకేషనల్ అవార్డు, బెక్కంటి శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ వారిచే ఆట అవార్డు, నేడు మహాకవి గుర్రం జాషువా జాతీయ పురస్కారం నిన్న రాత్రి విజయవాడ వారిచే సేవ రత్న అవార్డుకు ఎంపికైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అందులో భాగంగానే విజయవాడలో సంస్థ అధ్యక్షులు భీమపాక పెదరాజుకు మెమొంటోను అందించి ,శాలువా కప్పి గౌరవించడం జరిగింది,
ఈ యొక్క సందర్భంగా మహాకవి గుర్రం జాషువా గారి పురస్కారంతో నన్ను సత్కరించినందుకు పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ విజయవాడ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే భద్రాచల పుర ప్రముఖులు ప్రముఖులు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారు మా నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ మిత్రులు ముందు ముందు మరెన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకోవాలని అభినందించారు.