మహాలక్ష్మి వారి ఉచిత కంటి వైద్యశిబిరం
ప్రజా గొంతుక నవంబర్ 7 దేవరకొండ జిల్లా నల్గొండ
స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సేవాసదనం నందు బుధవారం 08-11-2023 రోజు మాక్సివిజన్ శ్రీ మహాలక్ష్మి కంటి వైద్యాశాల వనస్థలిపురం వారు ఉచిత కంటి వైద్య శిబిరం పెన్షనర్స్, ఉద్యోగులకు నిర్వహిస్తున్నట్లు క్యాంపు ఇంచార్జీ కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ తెలియజేసినారు. అవసరం కలిగిన వారు తమ హెల్త్ కార్డుతో హాజరుకాగలరు. ఆపరేషన్ అవసరం కలిగిన వారిని తమ వెంట తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేసి వసతి, భోజనం వసతి కల్పించి తిరిగి దేవరకొండ చేరుస్తారని అధ్యక్ష, కార్యదర్శి తాడిశెట్టి నరసింహ, అంకం చంద్రమౌళి, పంగునూరు లింగయ్య తెలియజేసినారు.