మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.
– పాల్గొన్న సి.ఆర్.జగదీశ్వర్ రావు.
ప్రజా గొంతుక న్యూస్/చిన్నంబావి ప్రతినిధి/అక్టోబర్ 02
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సి.జగదీశ్వర్ రావు,పాల్గొని గాంధీజీ చిత్ర పటానికి పూల మాల వేశారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి మండల కేంద్రము లో సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులు,ఆశా వర్కర్ల,కు కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడిలను,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 26000/- వేల కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ రావుతో పాటు కొల్లాపూర్ మాజీ ఎంపీపీ సుధారాణి,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఖాదర్ యాదవ్,నరేందర్ గౌడ్, రామ్ సింగ్,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.