*మహాత్మా గాంధీ జీవితం ప్రపంచానికి ఆదర్శం*
– ఎంపిపి నిర్మలశ్రీశైలం గౌడ్
ప్రజా గొంతుక :షాద్ నగర్ ప్రతినిధి
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమనీ ఎంపిపి నిర్మలశ్రీశైలం గౌడ్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా తలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపిపి నిర్మలశ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ యావత్ భారతావని అంతా గాంధీజీ శాంతియుత పోరాటానికి మద్దతు పలికిందని, కోట్లాది మంది జనాలు ఆయన వెంట నిలిచారనీ ఆ సందర్భంలోనే ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
అహింస, సత్యం మార్గాన్ని ఆచరించారనీ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందు ఉండి నడిపారనీ అన్నారు.భారత దేశం అంతా రామరాజ్యం ఏర్పాటు అయిన నాడే గాంధీకి అసలైన నివాళులు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటి సర్పంచ్ లలిత జ్యోతయ్య,కో ఆప్షన్ ఇమ్రాన్,MPO రఘు,APO కృష్ణయ్య,సూపరిండెంట్ శ్యాం సుందర్,వార్డ్ నంబర్లు, నాయకులు,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.