Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం – అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

గాంధీ ఆదర్శాలను భావితరాలకు అందించాలి

 

గాంధీ స్ఫూర్తి భావితరాలకు అందేలా పిల్లలకు ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన

 

ప్రజా గొంతుక పెద్దపల్లి :

మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు.

 

సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మధుమోహన్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

*అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ,* గాంధీ తన జీవితంలో జరిగిన అనుభవాలను తెలుపుతూ సత్య శోధన, My Experiment with Truth అనే ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని రచించారని, జీవితాంతం సత్యం, అహింస మార్గంలో గాంధీ గడిపారని అన్నారు.

 

సత్యం, అహింసా మార్గాలతో మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, అహింసా మార్గంలో పోరాటం చేయడం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సైతం ఏర్పడిందని అదనపు కలెక్టర్ తెలిపారు.

 

ప్రస్తుతం మనలో ఉన్న అసహనాన్ని, అశాంతిని పారద్రోలెందుకు గాంధీ బోధనలు ఎంతగానో దోహదపడతాయని, కలెక్టరేట్లో ఏర్పాటు చేసే గ్రంథాలయంలో సైతం గాంధీ పుస్తకాన్ని పొందుపరుస్తామని, ప్రతి ఒక్కరూ గాంధీ రచించిన పుస్తకాన్ని చదవాలని, ఆచరణ ద్వారా గొప్పగా ఎదిగిన మహనీయులు మహాత్మా గాంధీ అని అదనపు కలెక్టర్ సూచించారు.

 

గాంధీ మార్గదర్శకాలను మనమంతా పాటించాలని, గాంధీ సమాజానికి అందించిన విలువలు, సేవలు భావితరాలకు తెలిసేందుకు ప్రభుత్వం ఉచితంగా గాంధీ చిత్రాన్ని పిల్లలకు ప్రదర్శించిందని అదనపు కలెక్టర్ తెలిపారు.

 

ప్రభుత్వంలో వివిధ విభాగాలలోఉద్యోగాలు చేస్తున్న మనమందరం ప్రజలకు సేవకులమని, మన కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుదారులలో మనల్ని మనం చూసుకొని, ప్రశాంతంగా, మన దరఖాస్తుకు ఇతరులు ఎలా స్పందించాలని కోరుకుంటామో అదే విధంగా మనం స్పందించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

 

*పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మధుమోహన్ మాట్లాడుతూ,* మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సత్యం, అహింస అనే ఆయుధాలతో గాంధీ జీవితంలో అనేక విజయాలు సాధించారని అన్నారు.

 

మహాత్మా గాంధీ జీవితం నుంచి మనమంతా ప్రేరణ పొందాలని, వారి ఆశయాలను పాటించాలని అన్నారు. గాంధీజీ జీవనాన్ని పరిశీలిస్తే మనం ఎలా ఉండాలో, ఉండకూడదు తెలుస్తుందని తెలిపారు.

 

మహాత్మా గాంధీ భారత దేశానికి పరిమితమైన నాయకుడు కాదని, ప్రపంచ దేశాలలో సైతం గాంధీ విధానానికి మంచి ఆదరణ ఉందని, గాంధీ చూపిన స్ఫూర్తితో నెల్సన్ మండేలా వంటి వారు ఎంతో మంది పోరాటాలు చేసి విజయం సాధించారని అన్నారు.

 

దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేసే సమయంలో నల్లజాతీయులపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా గాంధీ పోరాటం చేసి విజయం సాధించారని, అనంతరం భారతదేశంలో భారతీయులు పడుతున్న బాధలను, భారతీయుల పట్ల జరుగుతున్న వివక్షను గమనించి స్వరాజ్యం దీనికి పరిష్కారం అని భావించి, శాంతియుతంగా అనేక ఉద్యమాలు చేశారని, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి నినాదాలతో దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని విజయం సాధించారని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో బి.సి. అభివృద్ధి అధికారి జే. రంగారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, డి.ఎం. అండ్ హెచ్. ఓ. డాక్టర్ ప్రమోద్ కుమార్, డి.పి. ఓ. చంద్రమౌళి, డి.ఈ. ఓ. – డి.మాధవి, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. శ్రీనివాస్, కలెక్టరేట్ సి. సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.