విజయభేరి సభను
విజయవంతం చేయండి
ప్రజా గొంతుక /నవపేట్ మండలం
డిసిసి ప్రధాన కార్యదర్శి
బంగ్లా రవీందర్ రెడ్డి
హైదరాబాద్ పట్టణ సమీపంలోని తుక్కుగూడలో ఈనెల 17వ తేదీన నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంగ్లా రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం విజయవంతం ద్వారా అవినీతి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడగడలాడించాలని ఆయన అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విధిగా ఈ సభకు విచ్చేసి సభను దిగ్విజయం చేయాలని ఆయన కోరారు.
బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో కోల్పోవడం ఎంతో కాలం లేదని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరభేరి మ్రోగించి పార్టీ అధికారంలోకి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు రమేష్ గౌడ్, జంగన్న, మల్లేష్,
రాజు, నర్సింలు, అశోక్ గౌడ్, శేఖర్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు