మల్లకల్,కళాశాలప్రిన్సిపాల్,కురాష్ట్రస్థాయిఉత్తమప్రిన్సిపాల్ అవార్డు.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా గద్వాలనియోజకవర్గం మల్దకల్ మండలo లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోపనిచేస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ లింగం కు రాష్ట్రస్థాయి ఉత్తమప్రిన్సిపాల్అవార్డు రావడం పట్లకళాశాల అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బందిమరియువిద్యార్థులు అభినందనలు తెలిపారు.
ఎం. రమేష్ లింగం సార్ ఈ కళాశాలలో 2017 సంవత్సరంనుండిఅంకితభావంతో కళాశాల విద్యాభివృద్ధి కొరకు పాటుపడుతూ,నిరంతరం పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేసినందుకు గాను రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు లభించిందనీ, ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు మరియువారితల్లిదండ్రులు కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా (432) ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగాఎంపికైన నాలుగు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డులలో మనజోగులాంబగద్వాల జిల్లానుండిఎంపికకావడంపట్లజిల్లాఇంటర్మీడియట్విద్యాధికారిహృదయ రాజు మరియువివిధ కళాశాలల ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రిన్సిపాల్ రమేష్ లింగంకి అభినందనలు తెలిపారు.