*మండల టిఆర్ఎస్ పార్టీ కమిటీ సమావేశం
*కార్యదర్శిగా నందిగామ సురేష్ ఎన్నిక
*రాజేంద్ర నగర్ :అక్టోబర్ 4(ప్రజా గొంతుక
కొత్తూరు మండల కేంద్రంలో మండల టిఆర్ఎస్ పార్టీ కమిటీ సమావేశం మండల అధ్యక్షుడు మండే కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యదర్శిగా పెంజర్ల గ్రామానికి చెందిన నందిగామ సురేష్ ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడు మండే కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఎమ్మెస్ సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు తామందరం కట్టుబడి ఉన్నామని కార్యదర్శిగా సురేష్ ను ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని మరింత క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు