బిఆర్ఎస్ లో మైనార్టీల భారీ చేరికలు
మైనార్టీలకు అభివృద్ధికి కృషి చేస్తుంది కెసిఆర్ ప్రభుత్వం
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం నాగిరెడ్డి పల్లె గ్రామం నుంచి సర్పంచ్ భవాని శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీలు భారీగా కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు జరిగాయి.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి , రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, సమక్షంలో పార్టీ కండువాలు కప్పి బిఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.చేరిన వారిలో షేక్ హైదర్ సాబ్, షేక్ గౌరీమియా, కాశీం, గఫూర్, మునీర్, అప్సర్, గౌన్స్, దావూద్, జావీద్, హమీద్, హాజిత్, చాన్మియా, సత్తార్, ఉస్మాన్, సాజిద్, షరీఫ్, అన్వర్, మున్నా, హుస్సేన్, ఇబ్రహీం తదితరులు పార్టీ కండువా కప్పుకున్నారు.
బిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి మల్లేశం గౌడ్ ,ఎండి సయ్యద్, నేతృత్వంలో మైనార్టీ పెద్దమనుషులు, యువకులు భారీగా బిఆర్ఎస్ లో చేరి నాగిరెడ్డిపల్లె మైనార్టీ లు మొత్తం ఏకగ్రీవంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఓట్లు వేసి గెలిపించుకుంటామని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానికుడు కాదని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, స్థానికుడై ఉన్న కొమ్మూరి ప్రతాపరెడ్డి పూటకో పార్టీ మారడం తప్ప నియోజవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఆదివారం ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకొని,తన సొంత అవసరాల నిమిత్తం 3 పార్టీల మారిన ఘనత కొమ్మూరి దే అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు షేక్ సయ్యద్, షేక్ సర్దార్, ఫరీద్, చిన్న సర్దార్, అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.