బిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ బిజెపి నుండిభారీ చేరికలు : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్:
రాయికల్ మండల మూటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ బిజెపి నాయకులు యూత్ నాయకులు 100 మంది బిఆర్ఎస్ పార్టీ మరియు సంజయ్ కుమార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ,
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెక్కం తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, యువత అధ్యక్షుడు లక్ష్మణ్, సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్, మాజీ సర్పంచ్ అబ్బూరి రాజేశం, సీనియర్ నాయకులు రమేష్ ,కరుణాకర్ రావు, అంజయ్య ,రాజేశం ,రంజిత్, దామోదర్ ,బుచ్చన్న ,వేణు, పవన్ ,తిరుపతి, రఘు తదితరులు పాల్గొన్నారు.