పాపన్నపేట మండలంలో పర్యటించిన
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
పాపన్న పెట్ ప్రజా గొంతుక
పాపన్నపేట: దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేనన్ని పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
బుధవారం పాపన్నపేట మండల పరిధిలోని శానాయిపల్లి, డాక్యా తండా గ్రామాల్లో పంచాయతీ భవనాలు, జయపురంలో అంగన్వాడి భవనం ప్రారంభించారు. జయపురంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం, బీసీ ముదిరాజ్ కమ్యూనిటీ భవనాల పనులకు శంకుస్థాపన చేశారు. గాంధార్ పల్లిలో ఈ పంచాయతీ భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడారు.
గత పాలకుల అనాలోచన ధోరణి వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకు వెళుతున్నట్లు వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు పథకాల ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని అందజేస్తున్నట్లు చెప్పారు . రైతు సంక్షేమానికి ప్రాధాన్యతలతో ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత భారాస ప్రభుత్వం అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు,తండాలు, మదర గ్రామాలు పంచాయతీగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు రూ.180 కోట్లు మంజూరయ్యాయని,
త్వరలో ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. అనంతరం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్ లో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు సోములు, మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఏడుపాయల చైర్మన్ సాతెల్లి-బాలాగౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.