నేడే మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువత కు సదవకాశం
ప్రజా గొంతుక/ కేసముద్రం/ అక్టోబర్/8
బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు సాయి బంగారు తెలంగాణ సాధన దిశగా నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశం కల్పించుటకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు 70 కంపెనీలతో సుమారు 2500 ఉద్యోగాల కల్పన కు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నరని, ఇట్టి కార్యక్రమాన్ని యువత ఉపయోగించుకోవాలని, మండల బి ఆర్ ఎస్ యూత్ అద్యక్షుడు తొనుపునూరి సాయి కృష్ణ పిలుపునిచ్చాడు, ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చిర్రా యాకాంతం, వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్, ఉపాధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి శరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు