Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత, యువతీ యువకులు వినియోగించుకోవాలి

— జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

 

ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ టౌన్:

 

సెప్టెంబర్ 20 వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో పాలకుర్తి నియోజకవర్గం స్థాయి మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళా లో సుమారు 80 కంపెనీలు పాల్గొంటాయని 13 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో

 

ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పదవ తరగతి ఆపైన చదువుకున్న విద్యార్థులు,(కొన్ని జాబ్ ల కోసం ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు)సంబంధిత సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.