మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న శ్రీధర్మశాస్త్ర గోశాల ఫౌండేషన్ సభ్యులు
ప్రజా గొంతుక న్యూస్/ పెద్దపల్లి
రామగుండం కమిషనర్ రేమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సోమవారం రోజున పెద్దపల్లి స్థానిక ఐటిఐ మైదానంలో 6006 మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న సందర్భంగా సుల్తానాబాద్ సీఐ జగదీష్ ఆదేశాల మేరకు, సుల్తానాబాద్ ఎస్సైలు విజేందర్, వినిత, అశోక్ రెడ్డి, ఆధ్వర్యంలో స్థానిక శ్రీధర్మశాస్త్ర గోశాల సభ్యులు పాల్గొని రక్తం అందించడం జరిగింది.
ప్రజలకు ఉపయోగమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వారికి ,ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన అన్ని శాఖల అధికారులకు,
వాలంటరీలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీధర్మశాస్త్ర గోశాల ఫౌండేషన్ సుల్తానాబాద్ వారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి సూర్య, ప్రధాన కార్యదర్శి నూక రాందాస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.