గోవా లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడలకు అర్హత సాధించిన విద్యార్థులు…
శుభాకాంక్షలు తెలిపిన ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య
ప్రజా గొంతుక ఓదెల :
ఓదెల మండలం తెలంగాణా రాష్ట్ర గ్రామీణ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలోని దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల విజయదుoదుబి మోగించారు.
గోవా లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడలకు అర్హత సాధించిన 5 మంది విద్యార్థులు
ముద్దమల్ల అజయ్. గోల్డ్ మెడల్.రాయిల్ల కళ్యాణి గోల్డ్ ,మెడల్ రాయిళ్ళ బాలరాజు గోల్డ్ మెడల్ ,ఎస్ మని చరణ్ తేజ గోల్డ్ మెడల్ ,గుంటి కావ్య
గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు.రాష్ట్ర స్థాయి లో ఒకే పాఠశాల కు 5 విభాగాలలో 5 గోల్డ్ మెడల్స్ రావడం అది మన పాఠశాలకు రావడం ఎంతో గర్వకారణమని
కష్ట పడి సాధన చేసిన విద్యార్థులకు సహకరించిన తల్లి దండ్రులకు, నా వెన్నంటి సహకరించిన ప్రధానోపాధ్యాయులు రమేష్,తోటి ఉపాధ్యాయ బృందానికి మరియు గ్రామం నుండి ప్రోత్సాహం అందించిన సర్పంచ్ కోట దామోదర్ రెడ్డి పంచాయితీ సెక్రటరీ ముత్యాల సందీప్ దాసరి పద్మా హన్మయ్య ఫౌండేషన్ వారికి పి టి విష్ణుకు. ప్రత్యేక ధన్యావాదాలు తెలిపిన గ్రామస్తులు అదేవిధంగా ఓదెల మండలానికి ఒక.గర్వకారణం తెచ్చిపెట్టిన కనగర్తి దాసరి పద్మ హనుమయ్య జిల్లా పరిషత్ లో చదివిన 5 మంది విద్యార్థులు జాతీయస్థాయిలో జరిగే క్రీడలకు అర్హత పొందిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ పిటి విష్ణుకు శుభాకాంక్షలు తెలిపిన ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య సర్పంచ్ కోట దామోదర్ రెడ్డి హెచ్ఎం ఎర్ర రమేష్ తదితర ఉపాధ్యాయ బృందం శుభకాంక్షలు తెలిపినారు.