మెదక్‌లో మున్నూరు కాపు కృతజ్ఞత సభ
ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్,
మెదక్ ప్రజా గొంతుక న్యూస్
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
పద్మా దేవేందర్ రెడ్డి మన ఆడపడుచు.కరీంనగర్‌లో కలిసి చదువుకున్నాం. ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మెదక్ నియోజకవర్గ మున్నూరు కాపులదే
మున్నూరు కాపులు ఓట్లు వేయడమే కాదు.. పదిమంది చేత పద్మా దేవేందర్ రెడ్డికి ఓట్లు వేయించాలి
‘‘హైదరాబాద్ నడిబొడ్డున రూ.500 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేసీఆర్ మున్నూరు కాపులకు కేటాయించారు. అందులో భారీ టవర్ కడుతున్నాం. మున్నూరు కాపు పిల్లల్ని ఐఏఎస్, ఐపీఎస్‌లను చేసేలా అక్కడ అకాడెమీని ఏర్పాటు చేస్తున్నాం. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నాం. మున్నూరు కాపులకు మేలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మన ఓట్లన్నీ కేసీఆర్‌కే వేయాలి. అప్పుడే మరింత ఎక్కువగా మన జాతికి మేలు జరుగుతుంది. మెదక్‌లో మున్నూరు కాపు భవనానికి రూ.10 కోట్లు కేటాయించేలా చేస్తాను. భూమి పూజకు నేనే వస్తాను. పద్మా దేవేందర్ రెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్‌కు వేసినట్లే. నేను నా ఎన్నికల ప్రచారాన్ని వదులుకుని పద్మా దేవేందర్ రెడ్డి కోసం మెదక్ వచ్చాను’’ఆమెను బారి మెజార్టీతో గెలిపించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ తిరుపతి రెడ్డి. పట్లోళ్ల శశిధర్ రెడ్డి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి. వివిధ గ్రామాల మున్నూరు కాపు నాయకులు పాల్గొన్నారు