ప్రగతి ధర్మారంలో అంత్యక్రియలు
హాజరైన మంత్రి హరీష్ రావు
పాపన్నపేట /ప్రజా గొంతుక న్యూస్
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి గత కార్యదర్శి పెంటపర్తి రాజశేఖర్ రెడ్డి తల్లి రత్నమ్మ (80) అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం స్వగ్రామం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, అధికారులు గ్రామానికి వెళ్లి, మృతదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, పుట్టి అక్షయ కుమార్, పలువురు నాయకులు, అధికారులు… రత్నమ్మ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు