ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన
మంత్రి హరీష్ రావు….
మనోహరాబాద్ సెప్టెంబర్ 27(ప్రజా గొంతుక)
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో 1.92 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు.రాష్ట్ర సర్పంచ్ ల పోరం కన్వీనర్,స్థానిక సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని హారతులతో మంత్రి గారికి స్వాగతం పలికారు.
ఈ పీహెచ్సీ లో ల్యాబోరేటరీ,స్త్రీ,పురుషుల వార్డ్లు,ఆయుష్ క్లినిక్,ప్రసూతి,స్టెరిలైజేషన్,గైనిక్,టాయ్లెట్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.ఇందులో ఒక పీహెచ్సీ డాక్టర్,ఒక ఆయుష్ డాక్టర్,దాదాపు 20 మంది వైద్య సిబ్బంది ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనోహరాబాద్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇందులో 132 రకాల పరీక్షలను ఉచితంగా చేయడమే కాకుండా వైద్య బృందం నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఉంటారని తెలియజేశారు.ఇక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం 24 గంటల లోపు ఫలితాలను ఇవ్వడమే కాకుండా కావలసిన మందులను కూడా ఉచితంగా అందిస్తారని తెలిపారు.కెసిఆర్ చొరవ వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంటి ముందరే సౌకర్యవంతమైన వైద్య లభిస్తుందని,ఎవ్వరు కూడా ప్రైవేట్ హాస్పటల్ వైపు వెళ్ళకూడదని సూచించారు.ఇంతకు ముందు 30% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగితే 70% డెలివరీలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగేవని,తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులతో 76% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగితే కేవలం 24% శాతం ప్రైవేట్ ఆస్పత్రులలో జరుగుతున్నాయని గుర్తుచేశారు.మనోహరాబాద్ మండలం ఏర్పాటు చేయాలనే సుదీర్ఘ కలను కాంగ్రెస్,టిడిపి పాలనలో జరగలేదని కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు.మండల కేంద్రంలో సుమారు 12 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.కెసిఆర్ లేకపోతే ఇన్ని సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి కావని ప్రతి ఒక్కరు కేసీఆర్ ను గుర్తు చేసుకోవాలని కోరారు.త్వరలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.
ఇన్ని రోజులు చేయలేని అభివృద్ధి పనులను ఇప్పుడు ఎలా చేస్తారని ఇతర పార్టీ నాయకులను నిలదీశారు.ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ వంటే ప్రతాప్ రెడ్డి,ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్,ఎంపీటీసీ లతా వెంకటేష్,జిల్లా కలెక్టర్ రాజర్షీ షా,అదనపు కలెక్టర్ రమేష్,గడ అధికారి ముత్యంరెడ్డి,ఎంపీడీవో యాదగిరిరెడ్డి,ఎమ్మార్వో శ్రీనివాసరావు,డీఎస్పీ యాదగిరి రెడ్డి,సిఐ శ్రీధర్,ఎస్సై కరుణాకర్ రెడ్డి,ప్రభుత్వ అధికారులు,పోలీస్ సిబ్బంది,వైద్య సిబ్బంది,ప్రజా ప్రతినిధులు,మహిళలు,గ్రామస్తులు పాల్గొన్నారు.