మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటనను విజయవంతం చేయాలి
ప్రజా గొంతుక సెప్టెంబర్ 26 దేవరకొండ జిల్లా నల్గొండ
-నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవం
-దేవరకొండ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్
ఈనెల 29న దేవరకొండ నియోజకవర్గంలో జరిగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటనను విజయవంతం చేయాలని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…….
కొండమల్లేపల్లి మండలం పన్ని తండా వద్ద బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, కేశ్య తాండలో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన, కొండమల్లేపల్లి మండలం చెన్నారం గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రారంభోత్సవం, దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలో గిరిజన గురుకుల బాలుర పాఠశాల ప్రారంభోత్సవం, దేవరకొండ పట్టణములోని పెంచికల్ ఫహడ్ లో గిరిజన యువ కేంద్ర భవనం ప్రారభోత్సవం, దేవరకొండ పట్టణములోని
సాయిబాబా గుడి వద్ద బిటి రోడ్డు పనులకు శంకస్థాపన, దేవరకొండ పట్టణంలోని గిరిజన భవనం ప్రారభోత్సవం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆనంతరం గిరిజన భవనం సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ సి ఎస్ టి కమిషన్ సభ్యులు నేనావత్ రాంబాబు నాయక్,జడ్పీటిసి కేతవత్ బాలు,జడ్పీటీసీ సలహాదారులు మారుపాకుల సురేష్ గౌడ్,పసునూరి యుగేందర్ రెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి,రమావత్ దాస్రు నాయక్,లోకసాని తిరపతయ్య,దొంతం చంద్రశేఖర్ రెడ్డి,రాజినేని వెంకటేశ్వర్ రావు, ముత్యాల సర్వయ్యా’వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, పి ఎ సి ఎస్ చైర్మన్లు ముక్కమల్ల బాలయ్య,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,ఉజ్జిని విద్యాసాగర్ రావు,బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,సర్పంచుల ఫోరం అధ్యక్షులు నేనావత్ శ్రీను,రమావత్ మోహన్ కృష్ణ,కేతవత్ లక్ష్మణ్ నాయక్,అరేకంటి రాములు, బొడ్డుపల్లీ కృష్ణ,సర్పంచుల, ఎంపీటీసీలు,బిఅర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.