*కొత్తపేట పెద్ద చెరువులో చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
*సంతోషం వ్యక్తం చేసిన మత్స్యకారులు
ప్రజా గొంతుక న్యూస్ :షాద్ నగర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి సాధించే విధంగా వారికి ప్రతిఏట “ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం” చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట గ్రామంలోనీ పెద్ద చెరువులో షాద్ నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ గారు గంగమ్మ తల్లికి పూజలు చేసి, చేప పిల్లలను వదిలారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గంగపుత్రులకు, ముదిరాజ్ సోదరులకు రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అందిస్తుందన్నారు, దీని ద్వారా మత్స్యకారులంతా ఆర్థిక పరిపుష్టి సాధించి, ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, ఫిషరీస్ అధికారిని సుకీర్తి, గ్రామ సర్పంచ్ కామ్లేకార్ నవీన్ కుమార్, ఎంపిటిసి మల్లేష్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, ఉప సర్పంచ్ నరేష్ యాదవ్, సర్పంచులు తలసాని వెంకటరెడ్డి, శ్రీలతశ్రీనివాస్, కృష్ణయ్య, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, నారాయణరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శేఖర్ పంతులు, కుంటి లక్ష్మయ్య, మామిడి యాదయ్య గౌడ్, కుమార్ గౌడ్, జగన్ రెడ్డి, గణేష్ గౌడ్, మత్స్యకారులు జంగయ్య, అల్లే సంతోష్ కుమార్, గణేష్, నాగేష్, ప్రవీణ్, రవి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.