*షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విజయం సాదించాలి
*ఇంటి ఇంటి ప్రచారన్నీ ప్రారంభం చిన్న మునిసిపల్ చెర్మన్ నరేందర్
షాద్ నగర్ అక్టోబర్ 24 (ప్రజా గొంతుక)
షాద్ నగర్ మున్సిపాలిటీ 26వ వార్డ్ శాసనసభ్యులు ఏమ్మెల్యే అంజయ్య యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ మునిసిపల్ బిఆర్ఎస్ నాయకులు షాద్ నగర్ మున్సిపాలిటీ కేంద్రంలోని మునిసిపల్ చేర్మెన్ నరందేర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో లోని అంశాలను గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తూఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ని గెలిపించాలని ప్రజల్ని కోరారు.
నియోజకవర్గంలో వరసగా రెండవ గెలిచి ప్రజల మన్నలను పొందిన ఎమ్మెల్యే మూడవ సారి కూడా విజయాన్ని సాదించాలి అన్నారు. అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజానేతగా, నాయకుడు లా కాకుండా నిరంతర కార్యకర్తల పనిచేస్తున్న మహా నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
సమయానుకూలంగా వచ్చే నాయకులకు ప్రజల కష్టాలు తెలియవని అన్నారు. మంత్రి స్థాయిలో జరిగే అభివృద్ధిని షాద్ నగర్ అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలిపిన గొప్ప నేతని అన్నారు. అభివృద్ధిలో దేశానికి తలమానికంగా తెలంగాణ ఉందని,అది కెసిఆర్ తోనే సాధ్యమని,షాద్ నగర్ గురించి అణువణువు తెలిసిన అంజయ్య యాదవ్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని,రాష్ట్రంలో కేసీఆర్ గెలుపు,షాద్ నగర్ నియోజకవర్గం లో వై అంజయ్య యాదవ్ గెలుపు ఎంతో అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.