కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజన్న
*అందరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలి
*షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
*కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజన్న
*ఎమ్మెల్యే అంజన్నకు సేవాసమితి సన్మానం
ప్రజా గొంతుక :రంగా రెడ్డిజిల్లా బ్యూరో
పరమ పవిత్ర, చారిత్రాత్మక కోట మైసమ్మ దేవాలయాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ బుధవారం దర్శించుకున్నారు.
కోట మైసమ్మ దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యతో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు ఆలయాన్ని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేను వేద పండితులు ఆశీర్వదించారు.
ఎంతో చరిత్ర గల దేవాలయాన్ని స్థానికులు పెద్ద ఎత్తున విరాళాలతో నిర్మించడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఆలయాన్ని సుందరీకరణగా నిర్మాణం చేపట్టడం పట్ల అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా ఉంటాయని ఈ నియోజకవర్గాన్ని కోట మైసమ్మ కాపాడుతుందని అన్నారు. ఎమ్మెల్యే అంజన్నను సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఖాజాపాష కేపీ, శుక్రవర్థన్ రెడ్డి తదితర సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, నటరాజన్, మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్, జాంగారి రవి తదితరులు పాల్గొన్నారు.