కోమటిపల్లి గ్రామంలో బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
ప్రజా గొంతుక/ ఇనుగుర్తి/ అక్టోబర్/5
ఇనుగుర్తి మండలం కొమటిపల్లి గ్రామంలో 187.50 లక్షల రూపాయలతో దుర్గమ్మ గుడి పెద్దమ్మ తండా నుండి పాత తండా కొమటిపల్లి వరకు, 140.00 లక్షల రూపాయలతో కోమటిల్లి నుండి అయిలయ్య తండా వరకు బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు మరియు
తారసింగ్ తండా గ్రామంలో 105.00 లక్షల రూపాయలతో ఆర్&బి రోడ్డు నుండి రాంలాల్ తండా నుండి మాలోత్ రెడ్యా తండా వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరియు తారసింగ్ తండా నూతన గ్రామ పంచాయతీ భవనం ను ప్రారంభించారు.
అనంతరం యువకులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ లను పంపిణీ చేశారు మరియు దసరా పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన….
మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్ గారు.
ఈ కార్యక్రమంలో…
ఎంపిపి వొలం చంద్ర మోహన్ గారు,
జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి గారు,
సత్యనారాయణ రావు, నీలం దుర్గేష్, కముటాం శ్రీను, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మండల & గ్రామ భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.