ప్రతిపక్ష పార్టీలకు వణుకు పుట్టిస్తున్న బిఆర్ఎస్ పార్టీ
రోడ్లు పనులు ప్రారంభం చేసిన ఎమ్మెల్యే చల్లధర్మ రెడ్డి

ప్రతిపక్ష పార్టీలకు వణుకు పుట్టిస్తున్న బిఆర్ఎస్ పార్టీ
రోడ్లు పనులు ప్రారంభం చేసిన ఎమ్మెల్యే చల్లధర్మ రెడ్డి
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ
సంగెం మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.
ప్రజా గొంతుక// వరంగల్ జిల్లా// సంగెం ప్రతినిధి:
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది. ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
శుక్రవారం సంగెం మండలంలోని లోహిత, తీగరాజుపల్లి, కాట్రపల్లి, కుంటపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా లోహిత గ్రామంలో నాలుగు కోట్ల ఎనభై లక్షలతో లోహిత నుండి గోపనపల్లి వరకు నూతన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఏడాది మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన 166 మంది రైతులకు గాను 15 లక్షల పైగా విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. అనంతరం
పెద్ద తండాలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం,డంపింగ్ యార్డ్, అంతర్గత సీసీ రోడ్లు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలకు మహర్దశ వచ్చిందని అన్ని రంగాల్లో అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. తండాలను గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తండాలకు ప్రత్యేక నిధులతో తండాలకు, మండలాలకు అనుసంధానంగ ఉండే రహదారులు పునరుద్ధరణ చేసుకున్నామని తెలిపారు.తీగారాజుపల్లి, రైతు వేదికలో సోంమ్లతండ,షాపూర్ గ్రామాలకు చెందిన రైతులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఈ ఏడాది మార్చి నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన 473 మంది రైతులకు గాను రూ.44 లక్షల 80 వేల విలువచేసే నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు.కుంటపల్లి గ్రామంలోని ఊరచెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మత్స్యకారులను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు.
నీటి వనరులున్న చోట వంద శాతం సబ్సిడీపై చేపలు, రొయ్యల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో మత్స్య సంపద గణనీయంగా వృద్ధి చెందిందని చెప్పారు. ఈ క్రమంలో మార్కెటింగ్ వసతితో మత్స్యకార కుటుంబాలకు మరింత ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అవకాశమున్న చోట హోల్‌సెల్, రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు.కాట్రపల్లి గ్రామంలో రూ.1 కోటి 5 లక్షలతో కాట్రపల్లి గ్రామం నుండి వడ్డెరగూడెం వరకు నూతనంగా మంజూరైన బి.టి.రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభం చేశారు.అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో మార్చి నెలలో అకాల వర్షాలకు పంట దెబ్బతిని నష్టపోయిన 484 మంది రైతులకు గాను రూ.56 లక్షలకు పైగా విలువచేసే చెక్కులు వారు పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఎవరని కుట్రలు చేసినా ప్రజల్లో ఉన్న ఆదరణతో కేసీఆర్ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని,సిఎం కేసీఆర్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లు అధికారులు ఉన్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతులు, వృద్ధులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.