తనపై వచ్చిన ఆరోపణలు తప్పని విజయ రమణారావు నిరూపించుకోవాలి ఎమ్మెల్యే దాసరి
ప్రజా గొంతుక పెద్దపల్లి :
కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని, ఆయన నామినేషన్ లో తప్పుడు పత్రాలు సమర్పించాడని వచ్చిన ఆరోపణలపై స్పందించిన తీరు ఆక్షేపనియమని పెద్దపల్లి BRS అభ్యర్థి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, విజయ రమణారావు పై ఫిర్యాదు చేసింది ఎవరైనా, వాటిని తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉందని పేర్కొన్నారు.ప్రతి వ్యక్తికి ఒక్క ఆధార్ కార్డు ఒక పాన్ కార్డు ఉంటుంది కానీ మన కాంగ్రెస్ రెండు పాన్ కార్డులు ఎందుకు ఉన్నాయో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
నోటికి వచ్చినట్టు నువ్వు ఇతరులపై ఆరోపణలు చేస్తావు కానీ, నీ పై వచ్చిన విదేశీ బ్యాంకుల్లో వందల కోట్ల విషయంపై, ఎందుకు ఇంత గాబరా పడుతున్నావు, అవి అబద్ధమని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదేనని పేర్కొన్నారు.
*నీపై వచ్చిన ఆరోపణలైన వందల కోట్ల విదేశీ బ్యాంక్ ఖాతాలు పూర్తి ఆధారాలతో ఉన్నట్టు తెలియ వచ్చిందని, వాటిపై కూడా త్వరలో తగువిధంగా ముందుకు పోతామని పేర్కొన్నారు.*
నిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపి లబ్ధి పొందాలని చూడడం విజయ రమణారావుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ప్రజలు అందరినీ గమనిస్తున్నారని ఎవరినీ నీతి ఏంది, ఎవరి నిజాయితీ ఏంది, ఎవరి పద్ధతి ఏంది, ఎవరి నిబద్ధత ఏందని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కళ్ళుండి చూడలేక అభివృద్ధిపై ఆరోపణ చేస్తున్నావ్ , ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి కోసం ఖర్చు చేశామన్నారు.
*C. సత్యనారాయణ రెడ్డి, BRS నాయకులు*
మాజీ ఎమ్మెల్యే అయి ఉండి , జాతీయ పార్టీ అభ్యర్థి గా పోటీపడుతూ, అభ్యంతరాలు చేస్తే కనీస అవగాహన లేకుండా, ఆరోపణలు చేయడం విజయ రమణారావు కే చెల్లిందని, C సత్యనారాయణ పేర్కొన్నారు.
అక్కడ నీపై రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ప్రజల సింపతి కోసం అబద్దాలను అవగాహన లేని మాటలను నువ్వు మాట్లాడుతున్నావని ఆయన పేర్కొన్నారు. మీరు కూడా దాసరి మనోహర్ రెడ్డి పై పెద్ద పెద్ద కట్టలతో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, కానీ మనోహర్ రెడ్డి ఒక్క మాట కూడా దానిపై మాట్లాడలేదని, కానీ మీరు మాత్రం రాజకీయ ప్రయోజనం కోసం అభ్యంతరాలు ఎవరో చేస్తే దాసరి మనోహర్ రెడ్డి పై ఆరోపణలు చేయడం ప్రజలను ఎమోషన్ గా చేయడం కోసమేనని ఆయన పేర్కొన్నారు.
*గంట రాములు జడ్పిటిసి ఓదెల*
నువ్వు గెలిసింది ఎన్నడూ..
ఎప్పుడో 1995 ZPTC గెలిసి, 2001లో ఓడిపోయావు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉండి కూడా 2014 లో నీకు డిపాజిట్ కూడా రాలేదు. ఎమ్మెల్యే ఉన్నా కూడా డిపాజిట్ కోల్పోయిన చరిత్ర నీదని మర్చిపోకండి అని హితవు చెప్పారు.
గెలుస్తున్నావని నీకు నీవు ప్రభగండ చేసుకుంటున్నావు కానీ , ప్రజలు ఎవరు నీతో లేరు, నీ భాష మార్చుకో… ప్రజలు ఎవరు ఇటువంటి భాషను స్వీకరిస్తలేరు. నీలాంటి భాషను సమాజానికి నేర్పించాలనుకుంటున్నావా. లేకపోతే ఒక గుండాలాగా వ్యవహరించడం , ఎవరు మాట్లాడితే వారిని బెదిరించే ప్రయత్నం చేయడం, పెద్దపల్లి ప్రజలు బెదిరించడానికో, గుండఈజానికో, నీలాంటి భాషను కోరుకుంటలేరు . ప్రజలు ఏం చెప్తారో అది 30 తారీకు నాడు చెబుతారు.
ప్రజల్లో సింపతి పొందడానికి ఓదెల మండలం నుండి ఉరికి వచ్చిన అంటూ ఆరోపణ చేస్తున్నావ్ కానీ, నిన్నేదో అన్యాయం చేస్తున్నామని, ప్రభగండ తయారు చేసుకుంటున్నావు, కానీ ప్రజలు ఎవరు నిన్ను నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు.
పందలకోట్ల రూపాయల బ్యాంకు ఖాతాలు గురించి నీ మీద ఆరోపణలు చేస్తే అబద్ధమని నిరూపించుకోవలసిన బాధ్యత నీపై ఉండగా, తప్పించుకోవడానికి, బుకాయించుకోవడానికి మార్గాలు చూసుకుంటున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఈ నాలుగు రోజులే నీ అబద్ధాలు కొనసాగుతాయని మూడు తారీఖున ప్రజలు ఇచ్చే తీర్పు తర్వాత నీకు చెప్పుకోవడానికి ఎటువంటి అబద్ధాలు మిగలవని గంట రాములు పేర్కొన్నారు,ఈ పాత్రికేయ సమావేశంలో ఎంపీపీ బండారి స్రవంతి – శ్రీనివాస్,పిఎసిఎస్ చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కొయ్యడ సతీష్ పెంచాల శ్రీధర్, బాలసాని ఈశ్వర్, పైడా రవి, బాలసాని శ్రీనివాస్, పెద్ది వెంకటేష్, తాళ్ల కళ్యాణ్, చోప్పరి వంశీ , లవన్ కుమార్ , చొప్పరి అన్వేష్ తదితరులు ఉన్నారు.