తెలంగాణాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం పంపిణీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి తలకొండపల్లి మండలం (ప్రజా గొంతుక ప్రతినిధి బివి పార్థు)
తలకొండపల్లి మండలానికి ప్రత్యేక కోటాలో 1300 మంది లబ్ధిదారులైన మహిళలకు ప్రొసీడింగులను కల్వకుర్తి MLA జైపాల్ యాదవ్ గారు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ,ఎంపిపి తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్,ఆమనగల్ మార్కెటింగ్ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పంపిణీ చేసారు.
మరియు తలకొండపల్లి మండల కేంద్రంలో 311 ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన బిడ్డ నుండి చావు వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ముందుకు సాగుతుందన్నారు.రాబోయే రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజలందరి ఆశీస్సులతో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేసారు.మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ గా నియమించినందుకు వెంకటేష్ గారు ముఖ్యమంత్రి గారికి KTR గారికి అలాగే MLA జైపాల్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు
.ఈ కార్యక్రమంలో వారితో పాటు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పద్మ నరసింహ,మాజీ ఎంపిపి శ్రీనివాస్ యాదవ్ ,సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ ,మండలంలోని సర్పంచులు ఎంపిటీసిలు,సింగిల్ విండోడైరెక్టర్లు,మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు వివిధ గ్రామాల నాయకులు ముఖ్యంగా మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.