రేపు బచ్చన్నపేటకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాక
ఆరోగ్య మహిళా, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో
ఆరోగ్య మహిళా, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొనున్నారు.
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశం లో బచ్చన్నపేట ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈనెల 15వ తేదీన జనగామ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి కార్యకర్త ప్రజలు పాల్గొనవలసిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, సర్పంచులు కవిత రాజు, మధు ప్రసాద్, బేగం ఆజాద్, మాసాపేట రవీందర్ రెడ్డి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.