చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన ఎమ్మెల్యే నోముల భగత్
ప్రజా గొంతుక ప్రతినిధి/నల్గొండ/మాడుగుల పల్లి
నల్గొండ జిల్లా… నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీ వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ..అరాచకాలకు, అణచివేతకు ఎదురెొడ్డి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో బీసీ లందరికీ సీఎం కేసీఆర్ సారథ్యంలోనే న్యాయం జరుగుతుందని కులవృత్తిదారులందరూ వెంటే నడవడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు.
ఈ కార్యక్రమం లో సాగర్ మున్సిపల్ చైర్మన్ అనూష శరత్ రెడ్డి, జిల్లా రజక సంఘాల కన్వీనర్ పగిల్ల సైదులు, పట్టణ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ, పట్టణ యూత్ అధ్యక్షుడు ఆవుదొడ్డి రాహుల్ యాదవ్, ఎడారి నరేష్,
నియోజకవర్గం రజక సంఘం అధ్యక్షుడు, భూష రాజుల బాల ఈశ్వర్, హాలియ రజక సంఘం అధ్యక్షుడు జుపెల్లి కృష్ణ,వూరె శ్రీనివాసు, మున్సిపల్ వార్డ్ నెంబర్ మంక్త నాయక్, ఏ ఐ బీఎస్ ఎస్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు సపవత్ చంద్రమౌళి నాయక్, సిరికొండ మధు, ఎడారి నాగార్జున, దుపెల్లి ఇస్తారి, కుక్కంటి రామ్మోహన్ రావు, వూరె గణేష్, గుజ్జల కొండల్, అర్జున్ నాయక్, చిన్న వాసు, కట్టా శ్రీహరి, కొండపల్లి సాయి, పల్లవొల రమేష్, శీలం వెంకట్ యాదవ్, దంతాల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు..