పార్దివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నోముల భగత్.
ప్రజా గొంతుక/నల్గొండ/నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హలియా మున్సిపాలిటీ అనుముల ఏడో వార్డుకు చెందిన తోకల శ్రీను గుండెపోటుతో మృతి చెందడం వలన వారి నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, 8 వార్డు కౌన్సిలర్ ప్రసాద్ నాయక్, 9వ వార్డు ఇన్చార్జ్ మాతంగి కాశయ్య, జింకల హరిప్రసాద్, బొడ్డుపల్లి మురళి, జూపల్లి కృష్ణ, సివర్ల చరబండరాజు,సీతారాల మహేష్,గంగుల శివ, ఎస్ కే భాష, సైదులు, పిల్లి నరేష్, వంగూరు రామలింగం తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.