*టెస్లా డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*
*రాజేంద్ర నగర్ : అక్టోబర్ 18(ప్రజా గొంతుక న్యూస్ )*
శంషాబాద్ మున్సిపల్, రాల్లగూడ రోడ్డు, టెస్లా డయాగ్నొస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. వైద్యుడు, రోగ నిర్ధారణ చేయడంలో, భౌతిక సంకేతాలు, బాధ యొక్క అశాబ్దిక సంకేతాలు మరియు ఎంచుకున్న ప్రయోగశాల మరియు రేడియోలాజికల్ మరియు ఇతర ఇమేజింగ్ పరీక్షల ఫలితాలు వంటి అనేక ఇతర ఆధారాలపై కూడా ఆధారపడతారన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు కొనమల శ్రీనివాస్, జాంగిర్ ఖాన్, కవితా ప్రసాద్, పి శ్రీనివాస్ గౌడ్, జీవై ప్రభాకర్, తాజ్ బాబా, కర్ణం జ్ఞానేశ్వర్, హనుమంతు ముదిరాజ్, కాలనీవాసులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.