నార్సింగ్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ప్రజా గొంతుక న్యూస్ :రాజేంద్ర నగర్
నార్సింగి మున్సిపల్ పరిది లోని మంచిరవుల వార్డ్ లో రూ.44 లక్షల తో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ప్రారంభోత్సవం రూ.2 కోట్ల తో నిర్మిచానున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్క్ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.. ప్రకాష్ గౌడ్,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ నార్సింగ్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో అగ్రస్థానం నిలుపుతామని అత్యధిక నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో కాకుండా
దేశంలోనే అగ్రస్థానంలో అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో ఉన్నది సంక్షేమ పథకాలలో కూడా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నది అటువంటి పార్టీని మళ్ళీ ఆదరించాలని మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిపించుకోవాలని తెలియజేయడం జరిగినది.
కార్యక్రమం లో మున్సిపల్ చేర్మెన్ రేఖ, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.