*మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభిచిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
*పేద ప్రజలకు, కార్మికులకు ఎంతగానో ఉపయోగం
*ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*
ప్రజా గొంతుక న్యూస్ :రాజేంద్ర నగర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని మైలార్దేవపల్లి డివిజన్, కట్టేదాన్ లో జయదేవ్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభిచిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
మెగా హెల్త్ క్యాంప్ వల్ల చుట్టు పక్కల పేద ప్రజలకు, సంస్థలో పనిచేసే కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ప్రేమ్ గౌడ్,యూత్ ప్రెసిడెంట్ రఘు యాదవ్,డివిజన్ నాయకులు సరికొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..