క్రీడాకారిణి కి ఎమ్మెల్సీ పోచంపల్లి ఆర్థిక సహాయం
తైక్వండో క్రీడాకారిణి “రుద్ర” అంతర్జాతీయ పతకం సాధించాలి.
– పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ప్రజా గొంతుక /జనగామ
జనగామ జిల్లా నుండి అస్సాం రాష్ట్రంలో గౌహతిలో జరిగే జాతీయ స్థాయి తైక్వండో పోటీల్లో పాల్గొంటున్న అబ్బాస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారిణి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలువగా
తను సాధించిన విజయాలు తెలుసుకొని రుద్రను, అబ్బాస్ మాస్టర్ ను అభినందించి వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనుటకు 25000/-ఆర్ధిక సహాయం అందించారు. ఈ సదర్భంగా రుద్ర మాట్లాడుతూ
తన శిక్షణకు, విజయాలు సాధించేందుకు సహకరిస్తున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి కి, తనను అభినందించి, అంతర్జాతీయ పోటీలకు వెళ్ళుటకు సహకరిస్తానని తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపింది.