ఇంజనీర్ సీటు ఇప్పించి తన ఉదారత చాటుకున్న పోచంపల్లి
ప్రజా గొంతుక /జనగామ
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
జనగామ పట్టణానికి చెందిన కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మి నాగరాజు కుమారుడు గుర్రం కార్తిక్ కు విఎన్ఆర్ కాలేజీ లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించారు.
విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు కోరారు. దానికి తన వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అడగగానే గుర్రం భూలక్ష్మి నాగరాజు కుమారునికి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించిన సీఎం కేసీఆర్ కి, కేటీఆర్ కి, మరియు స్థానిక సంస్థల MLC పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కి, కృతజ్ఞతలు తెలిపిన BRS మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మల్లవరం అరవిందరెడ్డి, కౌన్సిలర్ మహమ్మద్ సమద్, కో ఆప్షన్ మెంబెర్ మస్సీ ఉర్ రహ్మాన్. బచ్చన్నపేట మండల సర్పంచులు వెంకట్ గౌడ్, మేకల రాజు తదితరులు పాల్గొన్నారు.