నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్సీ
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం/ హైదరాబాద్
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి ని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సుమారు 200 మంది మంగళవారం రోజున కలిసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు పలికారు. కార్యకర్తల నాయకులు గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలు వారికి వివరించారు.
వెంటనే స్పందించిన పోచంపల్లి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
నాగిరెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి, గ్రామస్తులకు తెలిపారు.
కొన్నె -నాగిరెడ్డిపల్లి రోడ్ తాత్కాలిక మరమ్మత్తు కోసం 5 లక్షలు శాంక్షన్ చేస్తున్నట్లుగా తెలిపారు.
మహిళల స్వయం ఉపాధి కోసం ఎమ్మెల్సీ సొంత డబ్బులతో 2 రోజుల్లో కుట్టు మిషన్ కేంద్రం ప్రారంభిస్తున్నట్లుగా వివరించారు.
ఎమ్మెల్సీ తన గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించడంతో బిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.