టార్గెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మొండ్రాయి విద్యార్థి
ప్రజా గొంతుక //వరంగల్ జిల్లా సంగెం ప్రతినిధి:
నర్సంపేట మండలంలోని గీతాంజలి ఉన్నత పాఠశాల లో జరిగిన టార్గెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికైన విద్యార్థి సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన తూర్పటి. యోగేశ్వర్.రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందడు
ఈ విద్యార్థి దామెర మండలానికి చెందిన శ్రీహర్ష ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు వచ్చే నెల 2:9:2023నుండి6:9:2023వరకు షిర్డి (మహా రాష్ట్ర) లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
దీనిని పురస్కరించుకొని పాఠశాల డైరెక్టర్లు మెరుగు శివా నంద్ ,రచమల్ల వెంకట్ రాజ్,వ్యాయామ ఉపాధ్యాయులు జన్ను రమేష్, పాఠశాల సిబ్బంది తోటి విద్యార్థులు తల్లి తండ్రులు, యోగేశ్వర్ ను అభినందించారు.