ప్రతి గ్రామంలో కోటి 50 లక్షల రూపాయలకు పైగా పనులు చేశా
కారు గుర్తుకు ఓటేద్దాం భారీ మెజారిటీతో గెలిపిద్దాం సీఎం కేసీఆర్ కి,బహుమతిగా ఇద్దాం
హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి
ప్రజాగొంతుక న్యూస్/హుజూర్ నగర్
హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట రామచంద్రాపురం, కోదండరామపురం ఎల్బీనగర్ అప్పిరెడ్డిగూడెం గానుగబండ, పరెడ్డి గూడెం,గారకుంట తండా మరియు కల్మల్ చెర్వు గ్రామాలలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పాటు మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లిగారు శంకరమ్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మరియు మండల ముఖ్య నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు బొట్టుపెట్టి,మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగేళ్ళలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుందని పత్తా లేని ఉత్తమ్ కావాల్నా కండ్ల ముందు అభివృద్ధి చేసిన సైదన్న కావాల్నా ప్రజలు ఆలోచించాలని ఉత్తమ్ అభివృద్ధికి అడ్డుపడినా సైదన్న చేస్తూనే ఉంటడు అని, గతంలో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదని తాను వచ్చాక అభివృద్ధి మొదలైందని అన్నారు పని చేసే వాళ్ళని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు ప్రతి గ్రామంలో కోటి 50 లక్షల రూపాయలకు పైగా పనులు చేయడం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చిండో సమాధానం చెప్పాలన్నారు ,అభివృద్ధి వైపు ఉంటారా అభివృద్ధినిరోధకుల వైపు ఉంటారా ఆలోచించాలన్నారు. ఈ నాలుగేళ్ళ లో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుందని కారు గుర్తుకు ఓటేద్దాం, భారీ మెజారిటీతో గెలిపిద్దాం సీఎం కేసీఆర్ కి, బహుమతిగా ఇద్దామని హుజూర్ నగర్ లో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దామని అన్నారు. సాగర్ లో నీళ్లు డెడ్ స్టోరేజ్ లో ఉన్నా కూడా ఎడమ కాలువకు సాగర్ నీళ్లు మాట్లాడి, ఇచ్చినం,ఎమ్మెల్యే అవడానికి కారణం నియోజకవర్గ యూత్ యువత కోసం స్కిల్ సెంటర్ కూడా పెట్టిస్తం. పేదలకు ఇండ్లు ఇప్పిచ్చే బాధ్యత నాది అబ్బిరెడ్డి గూడెం గ్రామంలో ఒక కోటి ఎనభై లక్షల రూపాయల పనులు చేయడం జరిగింది. ఈవీఎం ప్యాడ్ లో 5 వ నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలి.ఈనెల 30న జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి మరోసారి ఆశీర్వదించగలని కోరారు.