కుటుంబ సభ్యుల వేధింపులతో మహిళ ఆత్మహత్య
మృతురాలి తల్లి దాకని పెంటమ్మ ఫిర్యాదు
పాపన్నపెట్ ప్రజా గొంతుక
పాపన్న పెట్ మండల పరిధిలోని మల్లంపెట్ గ్రామంలో ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మల్లంపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మల్లంపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పాపన్నపేట మండల పరిధి మల్లంపేట గ్రామానికి చెందిన సైదు నాగేష్ కు గత 11 సంవత్సరాల క్రితం సైదు లక్ష్మీ అలియాస్ సుమలత (28)తో వివాహం జరిగింది.
వీరికి ముగ్గురు ఆడపిల్లలే సంతానం కావడంతో భర్త నాగేష్ తో పాటు అత్త యాదమ్మ, మామ రాములు తరచూ గొడవ పడే వారని తెలిపారు. మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా వేధింపులకు గురి చేసే వారిని తెలిపారు. వేధింపులు తాళలేక లక్ష్మి బుధవారం గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది అని. తన కూతురు మరణానికి భర్త, అత్తమామలే కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి దాకని పెంటమ్మ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.