*గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
*ఎంపీపీ రవీందర్ యాదవ్
ప్రజా గొంతుక :షాద్ నగర్ ప్రతినిధి
*కేశంపేట* మారుమూల గ్రామాలలో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బోదునంపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎంపీపీ రవీందర్ యాదవ్ ను ఆయన స్వయం గృహం ఏక్ లాస్ ఖాన్ పేట గ్రామంలో ఘనంగా సన్మానించారు.
గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో బాక్స్ కల్వర్టు నిర్మించాలని గ్రామస్తులు కోరడంతో 45 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎంపీపీ రవీందర్ యాదవ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులకు కట్టుబడి ఉంటుందని రాబోవు రోజులలో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఎన్నం లింగారెడ్డి, టిఆర్ఎస్ యువ నాయకులు పిప్పళ్ళ శేఖర్, గ్రామస్తులు నీల పాండు పిప్పళ్ళ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.