ఆత్మగౌరవ సభకు ముదిరాజులు కదలిరావాలి…….
మనోహరాబాద్ అక్టోబర్07(ప్రజా గొంతుక)
సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగే ముదిరాజ్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేసేందుకు ముదిరాజులు కదలిరావాలని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి సర్పంచ్ కర్రే నాగభూషణం ముదిరాజ్ అన్నారు.
మేడ్చల్ మండల బీసీ సెల్ అధ్యక్షులు అశోక్ ముదిరాజుతో కలసి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని బీఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీలను వారు డిమాండ్ చేశారు.అత్యధిక ఓట్లు గల ముదురాజులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని,రాజకీయాల్లో చట్టసభల్లో అవకాశాలు కల్పించడం లేదని వారు మండిపడ్డారు.ఎంఎల్ఏ,ఎంపీ సీట్లు కేటాయించి ముదిరాజుల రాజకీయ అభివృద్ధికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు.
పేరుకు రాజులమే తప్ప అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని,రానున్న ఎన్నికల్లో రాజకీయంగా పెద్దపీట వేయకుంటే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు అధిక స్థానాల్లో ముదిరాజులను నిలబెట్టి గెలిపించాలని,ముదిరాజులను తక్కువచూపు చూస్తే ఆ పార్టీలకు తీవ్ర వ్యతిరేకంగా పనిచేస్తామని వారన్నారు.రానున్న కాలంలో ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది చట్టసభల్లో మెజారిటీ సభ్యులగా ఉండే విధంగా ముదిరాజ్ కులస్తులు ఏకతాటిపై వచ్చి రాజకీయంగా ఎదగాలన్నారు.ముదిరాజులు అత్యధికంగా తరలివచ్చి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు