*నేడు షాద్ నగర్ కు రానున్న పురపాలక శాఖ మంత్రి..
*పలు అభివృద్ధి, శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్న కేటీఆర్.
ప్రజా గొంతుక : రంగా రెడ్డి జిల్లా బ్యూరో
రంగారెడ్డి, షాద్ నగర్: పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలలో భాగంగా నేడు తేది. 05-10-2023 (గురువారం)రంగారెడ్డి జిల్లాలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ముందుగా షాద్ నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం,బంజార భవన్ శంకుస్థాపన,
పబ్లిక్ మీటింగ్ లలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలసి ప్రారంభించనున్నారు.అనంతరం మధ్యాహ్నం 12గంటలకు మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో విజయ మెగా డెయిరీని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,రాష్ట్ర సమాచార పౌర సంబంధాల,గనులు భూగర్భ శాఖల మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.