*ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన*
*మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్*
*ప్రజా గొంతుక న్యూస్ :రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఆర్. ఆర్. గౌడ్.*
షాద్ నగర్ మున్సిపాలిటీ 28వ వార్డు గాంధీనగర్ కాలనీ లో ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూవస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతిఏటా ప్రభుత్వం తరపున బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హిందూ మహిళలకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ కానుక,క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ రాజు,బి ఆర్ ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు మలగారి సత్యనారాయణ, వార్డు యూత్ ప్రెసిడెంట్ అభిలాష్,ఆర్ పి శైలజ, మరియు వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.