*ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు
*మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మా మహేందర్ రెడ్డి*
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్*
*ప్రజా గొంతుక న్యూస్: రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ఆర్ గౌడ్*
సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్, అన్నారు బీసీ బందు చెక్కులను మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్.సుష్మా మహేందర్ రెడ్డి నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్ పర్సన్ కొలన్.సుష్మా మహేందర్ రెడ్డి. మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అముల చేస్తున్నారని తెలిపారు. తద్వారా కోట్లాది మంది తెలంగాణ ప్రజలు లబ్ధిపొందుతున్నారని వివరించారు. ఇటువంటి సంక్షేమ సర్కార్ దేశంలోనే మరెక్కడా లేదన్నారు. మరోమారు ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గృహలక్ష్మి పథకం, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు తదితర పథకాలను అందజేయడంలో ముందున్నామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వై కుమార్, కౌన్సిలర్, శ్రీకాంత్ యాదవ్, కౌన్సిలర్ చిన్నమనేని అశోక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తోకల మురళీకృష్ణ,తాజ్ బాబా,కె విజయ్ కుమార్ గౌడ్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.