*బతుకమ్మ ఘాటు పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మా మహేందర్ రెడ్డి
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్
*ప్రజా గొంతుక న్యూస్ : రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్.ఆర్.గౌడ్*
రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ మున్సిపాలిటీలోని కాముని చెరువు లో, తెలంగాణ ఆడ పడుచులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ యవరికి ఇబ్బెండి కలుకుండా బతుకమ్మ ఘాట్ కోసం ఆదివారం ఉదయం మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మా మహేందర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి, నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్,కలిసి బతుకమ్మ ఘాటు కోసం పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనం కోసం సిసి రోడ్డు పనులను పూర్తి చేయడం జరిగింది. అలాగే దసరా సందర్భంగా బతుకమ్మను తీసుకొచ్చే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు
చైర్ పర్సన్. మున్సిపల్ కమిషనర్ భోగేశ్వరులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలన్.మహేందర్ రెడ్డి మున్సిపల్ అధికారులు లక్ష్మణ్. మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు