*వేతనాల పెంపు ఉద్యోగ భద్రత కోసం అక్టోబర్ 8నుండి మున్సిపల్ కార్మికుల సమ్మె
*
పోచారం మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చిన సీఐటీయూ నేతలు*
*సిఐటియు మండల కార్యదర్శి ఎన్ సబిత*
వేతనాల పెంపు,ఉద్యోగ భద్రత ఇతర కీలక 13 డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 8 నుండి మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సిఐటియు మండల కార్యదర్శి ఎన్ సబిత తెలిపారు
శనివారం పోచారం మున్సిపల్ కమిషనర్ వేమన రెడ్డి కి సమ్మె నోటీసు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 21 వేల రూ. లు వేతనం ఇస్తుందని, మన రాష్ట్రంలో కూడా ఆ పద్ధతుల్లో వేతనాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు
రెండవ పి ఆర్ సి కమిషన్ సిఫార్సు చేసినట్లుగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మద్యంతర భృతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు ఆదివారాలు పండగ సెలవులు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ముఖ్యమంత్రిగా ప్రకటించిన విధంగా తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలన్నారు. మున్సిపల్ కార్మికుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ బెన్ఫిట్ 10 లక్షల రూ. లు, వారసులు లేని వారికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు .ఇలాంటి కీలక డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 8 నుండి జరుగుతున్న సమ్మెలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేసి సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో నాయకులు జి నాగమణి మున్సిపల్ కార్యదర్శి నల్లవెల్లి దాసు శ్రీరాములు వీరన్న డి సంతోష్ వి నర్సిహ్మ ,రమేష్ జి ఇందిరా రేణుక తదితరులు పాల్గొన్నారు