*మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు*
*ముస్లిం మత పెద్దలకు ముస్లిం సోదరులకు, శుభాకాంక్షలు తెలియజేసిన*
*శంషాబాద్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దూడల వెంకటేష్ ఆధ్వర్యంలో*
*ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్.సుష్మా మహేందర్ రెడ్డి*
*రాజేంద్ర నగర్: అక్టోబర్01(ప్రజా గొంతుక*
మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని ఆదివారం శంషాబాద్ లో ముస్లిం మత పెద్దలు ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దూరల. వెంకటేష్ గౌడ్,ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ముస్లిం మత పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మ మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తోకల మురళీకృష్ణ, కౌన్సిలర్ జాంగిర్ ఖాన్,మైనార్టీ సేల్ అధ్యక్షులు రఫీ, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ యాదవ్, కౌన్సిలర్ వై కుమార్ కౌన్సిలర్. శ్రీకాంత్ యాదవ్,కౌన్సిలర్ అజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బుచ్చిరెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, పి.శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంజద్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాజ్ బాబా, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు,మైనార్టీ సోదరులు, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దూడల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ….. ముహమ్మద్ ప్రవక్త దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు, దయ, ధర్మబద్ధమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికే ముహమ్మద్‌ను అల్లాహ్ పుట్టించాడని విశ్వసిస్తారని అన్నారు,
శంషాబాద్ లో హిందూ ముస్లిం అన్నదమ్ముల వలె గత సంవత్సరాల నుండి కలిసిమెలిసి కొనసాగుతున్నమని, ఇకముందు కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటామని ఈ సందర్భంగా దూడల వెంకటేష్ తెలియజేశారు.