వికలాంగులకు అండగా
నల్ల మనోహర్ రెడ్డి
ప్రజా గుంతక పెద్దపల్లి :
పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి మండలం బోంపల్లి గ్రామానికి చెందిన అరికిళ్ల రాయమల్లు మరియు భోజన్నపేట గ్రామానికి చెందిన బత్తుల కొమరయ్య వారి కాలు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొన్న
వికలాంగుల నెట్ వర్క్ జిల్లా అధ్యక్షుడు. గజ్జెల్లి సతీష్ సహకారం తో హైదరాబాద్ లో వారికి కృతిమ కాలు పెట్టించి వారికి అండగా నిలిచిన పెద్దపల్లి యంగ్ & డైనమిక్ లీడర్ నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి మరియు తెలంగాణ వికలాంగుల నెట్ వర్క్ జిల్లా అధ్యక్షులు గజ్జెల్లి సతీష్.
ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ నేడు మా అవసరాలు తెలుసుకొని మమ్మల్ని తమ స్వంత ఖర్చులతో హైదరాబాద్ కు తీసుకుపోయి మాకు కృతిమ కాలు పెట్టించి మాకు దైర్యం అందించిన నల్ల మనోహరన్న కి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేసారు.