*కాంగ్రెస్ పార్టీని కనురెప్పల కాపాడుకుంట – నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్
ప్రజా గొంతుక అక్టోబర్ 10 దేవరకొండ జిల్లా నల్గొండ
దేవరకొండ నియోజకవర్గంలో బిల్యా నాయక్ పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ కి వచ్చే నష్టమేమీలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కుడా లేని బిల్యానాయక్ లాంటోళ్ళు ఎంతో మంది వస్తుంటరు పోతుంటరు.
బిల్యా నాయక్ కాంగ్రెస్ లో ఉంటూనే ఎన్నో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఎస్.పి తరపున పోటీ చేసి పరోక్షంగా కాంగ్రెస్ ఓటమికి కారకుడు అవ్వడం, కాంగ్రెస్ లో ఉండి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడం , కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం , రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కి బాహాటంగా మద్దతు ఇస్తుండడం , కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకపోవడంవల్లనే టిపీసీసీ ఆయన అప్లికేషన్ ని తిరస్కరించింది.
దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపదలో ఆదుకోవడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి విధేయురాలిగా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని ఆమె తెలిపారు