Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

*అనుమ‌తులు లేకుండా ఎటువంటి స‌భ‌లు,స‌మావేశాలు నిర్వ‌హించ‌రాదు.

*ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం

 

*విలేకరులతో సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ హరీష్ వెల్లడి.*

 

ప్రజా గొంతుక :రంగా రెడ్డి జిల్లా బ్యూరో*

 

:ప్రశాంత వాతావరణంలో,సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్ తెలిపారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా కలెక్టర్ హరీష్ విలేకరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,, ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అక్టోబర్ 9 నుండే అమలులోకి వచ్చిందని, డిసెంబర్ 5వ తేదీ వరకు కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు.జిల్లాలో మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్ళ, ఎల్.బి.నగర్, శేరిలింగంపల్లి, రాజేందర్ నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు.

 

ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున అనుమ‌తులు లేకుండా ఎటువంటి స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌రాద‌ని, నిర్వ‌హించాల్సి వ‌స్తే త‌ప్ప‌నిస‌రిగా ముంద‌స్తుగా లిఖిత పూర్వ‌కంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రిట‌ర్నింగ్ అధికారుల నుండి అనుమ‌తులు పొందాల‌ని సూచించారు. జిల్లాలో ఎంసిఎంసి, సోష‌ల్ మీడియా బృందాలు ప‌ని చేస్తాయ‌ని తెలిపారు.ఎనిమిది నియోజక వర్గాలలో మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ , వీడియో స‌ర్వేలెన్స్ బృందాలు ప‌ని చేస్తాయ‌ని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.న‌వంబ‌ర్ 3వ తేదీ నుండి ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కుల బృందాలు ఏర్పాట్లు అవుతాయ‌ని తెలిపారు.జిల్లాలో మొత్తం 33 ల‌క్ష‌ల 56 వేల 056 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని,ఇందుకు గాను 3369 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. జిల్లాలో 1206 సమస్యాత్మక,10 వనరబుల్ పోలింగ్ కేంద్రాల‌లో పోలీసు బందోబ‌స్త్ తోపాటు మైక్రో అబ్జ‌ర్వ‌ర్స్ ప‌రిశీలిస్తార‌ని తెలిపారు.మొత్తం ఓటర్లలో 16 లక్షల 15 వేల 876 మంది మహిళా ఓటర్లు, 17 లక్షల 38 వేల 994 మంది పురుష ఓటర్లు, 596 మంది ఇతర ఓటర్లు, 590 స‌ర్వీసు ఓట‌ర్లు ఉన్నార‌ని తెలిపారు.18 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన యువ ఓటర్లు 66 వేల 359 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై సంబంధిత చట్టాలను అనుసరిస్తూ కేసులు నమోదు చేస్తామని అన్నారు.

 

కోడ్ ఉల్లంఘన గురించి ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే ఈసారి కొత్తగా సీ-విజిల్ యాప్ ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో తెచ్చిందన్నారు.ఈ యాప్ ద్వారా కోడ్ ఉల్లంఘన అంశాలు లైవ్ ఫోటోలు, వీడియోలు తీసి ఈ.సీ దృష్టికి తేవచ్చని సూచించారు.80 ఏళ్ళు పైబడిన వృద్ధులు,దివ్యంగ ఓటర్లు ఇంటి నుండి ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఈ.సీ నిర్ణయం తీసుకుందని,ఎన్నికల ప్రకటన వెలువడిన ఐదు రోజులలోపు 12-డి ఫారం భర్తీ చేసి బీ.ఎల్.ఒలకు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు.జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ప్లైయింగ్ స్కాడ్ బృందాలు ప‌ని చేస్తాయ‌ని తెలిపారు.జిల్లాలో సార్వ‌తిక ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించుట‌కు ముంద‌స్తుగా స‌మావేశాలు నిర్వ‌హించామ‌ని,

 

నోడ‌ల్ అధికారుల‌ను,స‌ర్వేలెన్స్, ప్లైయింగ్ స్కాడ్స్, సిబ్బందిని నియ‌మించామ‌ని తెలిపారు.అధికారుల‌కు కేటాయించిన విధులపై ఇప్ప‌కే ప‌లుధ‌పాలు శిక్ష‌ణ‌, స‌మావేశాలు నిర్వ‌హించామ‌ని అన్నారు.జిల్లాలో బుధవారం వరకు ఒక కోటి 62 లక్షల, 65 వేల 360 రూపాయల నగదును మద్యం 24 లీటర్లు సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, ఎన్నికల విభాగం అధికారి సైదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.